fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsసెప్టెంబర్ 10 న 'టక్ జగదీశ్ '

సెప్టెంబర్ 10 న ‘టక్ జగదీశ్ ‘

Nani TuckJagadish ReleaseDate

టాలీవుడ్: మజిలీ, నిన్నుకోరి లాంటి ఎమోషనల్ హిట్స్ సాధించిన శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరో గా రూపొందిన సినిమా ‘టక్ జగదీశ్’. ఏప్రిల్ లోనే థియేటర్ లలో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వలన వాయిదా పడింది. అనుకోని పరిస్థితుల్లో ఈ సినిమా విడుదల యూ టర్న్ తీసుకుని ఓటీటీ లో విడుదల అవనుంది. ఈ సినిమా ఓటీటీ విడుదల పై , రిలీజ్ డేట్ పై వివాదాలు వచ్చాయి. ఎట్టకేలకి ఇవాళ ఈ సినిమా విడుదల తేదీ ని ప్రకటించారు మేకర్స్. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాని సెప్టెంబర్ 10 న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదల చేస్తున్నారు.

ఈ విషయాన్నీ ఈ రోజు ఒక వీడియో విడుదల చేసి ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో నాని అన్న గా ‘జగపతి బాబు’ నటిస్తున్నారు. నాని కి జోడీ గా రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఒక ఫామిలీ చుట్టూ తిరిగే ఎమోషనల్ సినిమాగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో శివ నిర్వాణ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగానే జోడించినట్టు ఇప్పటివరకు విడుదలైన టీజర్స్ ద్వారా తెలుస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 10 న విడుదల ప్రకటించడం తో అదే రోజు థియేటర్లలో విడుదల అవనున్న నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ మార్చే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular