మూవీడెస్క్: నేచురల్ స్టార్ నాని తన తాజా చిత్రం సరిపోదా శనివారం ప్రచార కార్యక్రమంలో పాల్గొని తన తదుపరి కొత్త సినిమా ల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో డైరెక్టర్ వేణుతో సినిమా చేయాలని ఉన్నట్లు చెప్పారు.
అయితే, ఇది కేవలం సరదాగా జరిగిన చర్చ అని, సినిమా ఎప్పుడనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదని స్పష్టం చేశారు.
ఇటీవలే నాని దసరా సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు మరోసారి వేణుతో మాస్ పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వేణు తన తొలి చిత్రం బలగం తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో, నాని – వేణు కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
తమ సినిమా ఏ సమయంలో మొదలవుతుందో ఇంకా తెలియదని, కానీ ఈ ప్రాజెక్ట్ సన్నాహకాల్లో ఉందని నాని తెలిపారు.
వేణు తన టాలెంట్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి మరింత స్పష్టత రావాల్సి ఉంది.