హైదరాబాద్: థియేటర్ లు మూతపడి దాదాపు 150 రోజులు ముగిసింది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు మెల్ల మెల్లగా ఓటీటీ బాట పట్టుతున్నాయి. హిందీ లో కొందరు బడా స్టార్స్ సినిమాలు ఓటీటీ లో విడుదల అయ్యాయి కానీ తెలుగు, తమిళ్ లో మాత్రం ఇప్పటివరకు కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ తప్ప వేరే ఏ సినిమా కూడా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల అవలేదు. ఇది కూడా తమిళ్ దబ్ అని చెప్పుకోవచ్చు. తెలుగులో అయితే చిన్న సినిమాలు తప్ప కొంచెం పేరున్న యాక్టర్ సినిమాలు ఏవీ విడుదల అవ్వలేదు. ఈ మద్యే నాని, సుధీర్ బాబు నటించిన ‘ V ‘ సినిమా ఓటీటీ లో విడుదల అవబోతుంది , అవదు అని చాలా డిస్కషన్స్ నడిచాయి. చివరకి నాని ఒక వీడియో రిలీజ్ చేయడం తో అది ఖరారయినట్టే అని అర్ధం అవుతుంది.
నాని థియేటర్ లో ఒక సినిమా చూస్తూ అయిపోయాక అయ్యో అయిపోయిందికదా, అయితే ఏంటి మళ్ళీ చూడచ్చు మళ్ళీ మళ్ళీ చూడచ్చు ఎన్ని సార్లంటే అన్ని సార్లు చూడచ్చు. మళ్ళీ మిడ్ నైట్ షోస్, ఫస్ట్ డే ఫస్ట్ షోస్ మొదలవుతాయి.” ‘V’ హావ్ ఆన్ అనౌన్స్మెంట్ టుమారో ” అని ఈ స్పేస్ చూడండి అని హింట్ ఇచ్చాడు. నాని వీడియో లో చెప్పిన మాటలు, ఇంట్లోనే చూడొచ్చు అన్న ప్రకటనతో ‘V’ సినిమా ఓటీటీ విడుదల ఖరారైనట్టే. కేవలం అధికారిక ప్రకటనే మిగిలింది. ముందుగా రూమర్స్ లో విన్నట్టు సెప్టెంబర్ 5 న విడుదల అయ్యేట్టుంది ఈ సినిమా. ఇంకా వీడియో చివరలో వచ్చే ‘ఈ స్పేస్ చూడండి’ అనే ప్రకటన ప్రైమ్ కస్టమైజ్డ్ విసువల్ అవడం తో ప్రైమ్ లో విడుదల అవబోతున్నట్టు అర్ధం ఐతుంది. నాని కి ఇది 25 వ సినిమా. నాని, సుధీర్ బాబు నటించిన ఈ సినిమాకి మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్టర్. వీరితో పాటు అదితి రావు హైదరి, నివేత థామస్ హీరొయిన్ లుగా నటిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాని వెంకటేశ్వరా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.
anni Otts lone release cheyandi and anni okate dantlo release cheyandi.