టాలీవుడ్: నాచురల్ హీరో నాని ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి కలకత్తా నేపధ్యం లో పీరియాడిక్ కథతో రూపొందుతున్న ‘శ్యామ్ సింఘరాయ్’ సినిమా. నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీం నాని ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. ముందెప్పుడూ చూడని విధంగా నాని లుక్ కొంచెం కొత్తగా ఆకట్టుకుంది. నాని లుక్ ప్రతి సినిమాలో రెగ్యులర్ గా ఉంటుంది. పక్కింటి కుర్రాడి లుక్ లో ఇన్ని రోజులు ఆకట్టుకున్న నాని కధ తోనే కాకుండా లుక్ తో కూడా ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ దానికి నిదర్శనం. వెనక నుండి ఒక అమ్మాయి కౌగిలించుకున్నట్టు ఉంది కానీ ఆ కారెక్టర్ సాయి పల్లవి లేదా మరో హీరోయిన్ కృతి శెట్టి అయ్యి ఉండాలి.
బ్యాక్ డ్రాప్ లో రాయల్ ప్రెస్ అని ఒక న్యూస్ పేపర్ ప్రెస్ ని, టైపు రైటర్ ని, పబ్లిష్ చేసిన పేపర్లు ఉన్న రిక్షా ని చూపించారు. దానిని బట్టి నాని ఇందులో జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్నాడా అని సందేహాలు వెలువడుతున్నాయి. ‘టాక్సీ వాలా’ సినిమా రూపొందించిన డైరెక్టర్ ‘రాహుల్ సాంకృత్యాన్‘ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మిక్కీ.జె.మేయర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇలాంటి లుక్ లో నాని ని చూడడం ఇదే మొదటి సారి కావడం తో సినిమా పైన అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాని ఈ సంవత్సరం చివరి వారికి పూర్తి చేసి విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.