టాలీవుడ్: నాచురల్ స్టార్ నాని మరియు బాహుబలి లాంటి సినిమాలకి పని చేసిన కాస్ట్యూమ్ డిసైనర్ ప్రశాంతి కలిసి ‘వాల్ పోస్టర్’ అని బ్యానర్ స్థాపించి మంచి సినిమాలు రూపొందిస్తున్నారు. వీళ్ళ బ్యానర్ లో ఇప్పటివరకు ‘అ!’,’హిట్’ లాంటి సినిమాలు రూపొందించి , ఈ మధ్యనే హిట్ సీక్వెల్ ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ బ్యానర్ లో ‘మీట్ క్యూట్’ అనే సినిమా రూపొందనుంది. ఈ రోజు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలు పెట్టారు.
మొదటి షాట్ ని సీనియర్ నటుడు సత్యరాజ్ పై చిత్రీకరించారు. నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి ఈ సినిమాని నిర్మిస్తుండగా దీప్తి ఘంట అనే లేడీ డైరెక్టర్ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి సంగీతం అందించనుండగా, వసంత్ సినిమాటోగ్రఫీ చేయనున్నారు. ఈ సినిమాలోని మిగతా నటీ నటుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
‘అ!’ సినిమాతో వైవిధ్య మైన సినిమాలు తీసే ప్రశాంత్ వర్మ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన నాని, ‘హిట్ ‘ సినిమాతో శైలేష్ కొలను అనే మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీ కి పరిచయం చేసారు. ఇపుడు తీస్తున్న ‘మీట్ క్యూట్’ సినిమాతో కూడా మరో కొత్త దర్శకురాలిని పరిచయం చేస్తున్నారు. ఇలా తమ ప్రొడక్షన్ లో రూపొందే ప్రతీ సినిమాతో కొత్త టాలెంట్ ని ఆవిష్కరిస్తూ తమతో పాటు కొత్త వాళ్ళని కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తున్నారు.