అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే తనకు మెయిల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా ఆయన తన మెయిల్ ఐడీని ప్రకటించి ఎవరికైనా సమస్యలు ఉంటే తనకు మెయిల్ చేయాలని కోరారు. మెయిల్ ఐడీ: hello.lokesh@ap.gov.in.
తరచూ ప్రజలు తమకు వాట్సాప్ ద్వారా సమస్యలు పంపే వారని, అవి ఎక్కువ అవడం వల్ల మెటా తన అకౌంట్ ను అప్పుడప్పుడూ బ్లాక్ చేస్తోందని, దీనీని అరికట్టడానికి తాను తన మెయిల్ అడ్రస్ ను ఇచ్చి తమ సమస్యలు పంపాలని తెలిపారు.
ప్రజల నుండి వచ్చే సమస్యలకు తానే స్వయంగా స్పందిస్తానని, తగు చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. కాగా ఆయన ఎమెల్యే గా గెలిచినప్పటి నుంది తన ఇంటి దగ్గర రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు.
మంత్రి శ్రీ నారా లోకేష్ మెయిల్ అడ్రస్: hello.lokesh@ap.gov.in