భీమవరం: రాబోయే మూడు నెలల్లో పదివేల ఉద్యోగాలు కల్పిస్తామని తెలియచేసిన నారా లోకేష్.
భీమవరంలో మంత్రి పర్యటన
మంత్రి నారా లోకేష్ భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా, ఆయన రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన లోకేష్, రాబోయే మూడు నెలల్లో రాష్ట్రానికి టీసీఎస్ ఇన్నోవేషన్ హబ్ తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పించబడుతుందని తెలిపారు.
రతన్ టాటాపై ప్రశంసల వర్షం
రతన్ టాటా విలువలతో కూడిన పారిశ్రామికవేత్తగా ప్రపంచానికి సుపరిచితమని లోకేష్ కొనియాడారు. దేశాభిమానంతో పారిశ్రామిక రంగాన్ని ముందుకు నడిపిన ఆయన స్ఫూర్తిదాయక వ్యక్తి అని ప్రశంసించారు. తుపాను సహాయ చర్యల సమయంలో, హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళాలు ఇవ్వడంలో ఆయన చూపిన మానవత్వాన్ని గుర్తుచేశారు.
విద్యా రంగంలో మార్పులు
విద్యాశాఖ అత్యంత కష్టమైన శాఖ అని మంత్రి పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలను పూర్తిగా సవరించాలని యోచిస్తున్నామని తెలిపారు. పాఠ్య పుస్తకాల్లో రాజకీయ రంగులు, నాయకుల ఫొటోలు లేకుండా విద్యార్థులకు సమానత్వ భావనను పెంపొందించడమే తమ లక్ష్యమని చెప్పారు.
‘డ్రగ్స్ వద్దు’ క్యాంపెయిన్
విద్యార్థులను డ్రగ్స్ నుండి దూరంగా ఉంచేందుకు ప్రత్యేక క్యాంపెయిన్ ప్రారంభించామని, “డ్రగ్స్ వద్దు బ్రో.. డోంట్ బీ ముఖేష్” నినాదంతో కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు.
ఉండి నియోజకవర్గ అభివృద్ధి
ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అభివృద్ధి పనుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని లోకేష్ ప్రశంసించారు. ఆయనకు ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక అభినందనలు తెలిపారు.
సమన్వయం, అభివృద్ధి పైన చర్చ
రాష్ట్ర ఆర్థిక సమస్యల పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని లోకేష్ సూచించారు. టీడీపీ నాయకత్వం సమన్వయంతో పనిచేస్తేనే సైకో కి మళ్ళీ అవకాశముండదని స్పష్టంచేశారు.