టాలీవుడ్: తమిళ్ లో ధనూష్ హీరో గా రూపొంది సూపర్ హిట్ సాధించిన సినిమా ‘అసురణ్’. రెండు నేషనల్ అవార్డ్స్ ని పొందిన ఈ సినిమాని తెలుగు లో వెంకటేష్ హీరో గా ‘నారప్ప’ అనే టైటిల్ తో రూపొందించారు. పూర్తిగా తమిళ్ నేటివిటీ తో వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని తెలుగు లో శ్రీకాంత్ అడ్డాల రూపొందించాడు. మరి కొద్దీ రోజుల్లో ఓటీటీ లో విడుదల అవనున్న ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది.
సినిమా ట్రైలర్ చూస్తుంటే తమిళ్ వర్షన్ ని ఉన్నది ఉన్నట్టుగా దింపినట్టు కనిపిస్తుంది. ఈ సినిమాని మణిశర్మ సంగీతం అందించినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఒరిజినల్ తమిళ్ వర్షన్ నే నమ్ముకున్నట్టు అనిపిస్తుంది. సీన్స్, మ్యూజిక్ అన్నిటిని కలిపి చూస్తే ధనుష్ ని తీసేసి వెంకటేష్ ని పెట్టినట్టు కనిపిస్తుంది. సినిమాలో ఉన్న మెయిన్ సీన్, సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సీన్ కి సంబందించిన డైలాగ్ ట్రైలర్ చివర్లో విడుదల చేసేసారు మేకర్స్. వెంకటేష్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. యంగ్ లుక్ లో రెగ్యులర్ గానే ఉన్నా, ఓల్డ్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ట్రైలర్ ప్రకారం ఒరిజినల్ వర్షన్ కి పెద్దగా మార్పులు ఏం కనపడట్లేదు.
ఈ సినిమాలో వెంకటేష్ కి జోడీ గా ప్రియమణి నటిస్తుంది. మరిన్ని ముఖ్య పాత్రల్లో రాజీవ్ కనకాల, కార్తీక్ రత్నం , నాజర్, రావు రమేష్ నటిస్తున్నారు. ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.