న్యూఢిల్లీ: ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల పరిస్థితులపై అన్ని రాష్ట్రాల సీఎంలకు మోడీ ఫోన్ చేశారు.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్ మోహన్ రెడ్డి, కే చంద్రశేఖర్ రావు గార్లకు ఫోన్ చేసి రాష్ట్రాలలో కేసులు, నివారణ చర్యలు, ఆసుపత్రులు, వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు.
మిగతా రాష్ట్రాలైన బిహార్, అసోం, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి ఎక్కువైన సందర్భంలో ఆ రాష్ట్రాల సీఎంలతో కూడా మోడీ ముచ్చటించారు.
ఈ సమయంలో రాష్ట్రాలకు అవసరమైన సహాయం కేంద్రం చేస్తుందని ఆయన చెప్పారు. కరోనా కేసులు అత్యధికంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలను మోడీ ప్రశంసించారు. దేశంలో రోజురొజుకి కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇప్పటికే కేసులు 10 లక్షల మార్కును దాటింది. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు, సూచనలు చేసారు.