fbpx
Thursday, November 28, 2024
HomeBig Storyబంగ్లాదేశ్ లో కర్ఫ్యూ విధింపు!

బంగ్లాదేశ్ లో కర్ఫ్యూ విధింపు!

NATION-WIDE-CURFEW-AMID-BANGLADESH-PROTESTS

ఢాకా: బంగ్లాదేశ్ లో విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనలు పలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ లో కర్ఫ్యూ దేశవ్యాప్తంగా విధించింది.

కాగా, ఈ తీవ్రమైన ఆందోళనలను పోలీసులు అదుపు చేయడంలో విఫలం అవడంతో ప్రభుత్వం మిలటరీని కూడా రంగంలోకి దింపింది. ఇదిలా ఉండగా, ఆందోళనల్లో ఇప్పటి వరకు 105 మంది తమ ప్రాణాలను కోల్పోయారు.

అయితే, కేవలం రాజధానిలోనే 52 మంది మృతి చెందడం జరిగింది. ఈ మరణాల్లో ఎక్కువ శాతం పోలీసుల కాల్పుల్లో జరిగినవేనని తెలుస్తోంది.

పరిస్థితిని చక్కదిడ్డానికి అలాగే అనవసర ప్రచారాన్ని అడ్డుకోవడానికి రాజధాని ఢాకాలో ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.

అయితే, ప్రభుత్వం ఎన్ని నిషేధాలు విధించినా తాము మాత్రం తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తెగేసి చెబుతున్నారు.

ఈ ఘటన వల్ల జరిగిన మరణాలకు ప్రధాని షేక్ హసీనానే బాధ్యత వహించి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారూ డిమాండ్ చేస్తున్నారు.

బంగ్లాదేశ్ లో కర్ఫ్యూ కారణం:

పాకిస్థాన్‌తో 1971లో స్వతంత్ర దేశం కోసం జరిగిన విముక్తి యుద్ధంలో పాల్గొన్న వారి పిల్లలు మరియు ఇతర సమూహాలకు సివిల్ సర్వీస్ పోస్టుల్లో సగానికిపైగా ఇచ్చిన రిజర్వేషన్ల కోటా వ్యవస్థను ముగించాలని ఈ నెలలో విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనలకు పిలుపునిచ్చారు.

అయితే ఈ రిజర్వేషన్ కోటా వల్ల ప్రధాని హసీనాకు మద్దతుని అందించే ప్రభుత్వ అనుకూల సమూహాల పిల్లలకే ఈ పథకం నుంచి లబ్ధి పొందుతున్నారని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular