హైదరాబాద్: తెలంగాణలో “నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజ్”
అరుదైన జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు **నిమ్స్ ఆసుపత్రిలో రూ.50 లక్షల ఖరీదైన వైద్యం పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు *నిమ్స్ డైరెక్టర్ బీరప్ప ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజ్ (NPRD) ద్వారా ఈ వైద్యం అందించబడుతుంది. ఈ కార్యక్రమం కింద జెనెటిక్ మరియు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ప్రత్యేక చికిత్స అందించేందుకు స్పెషల్ వార్డులు మరియు డాక్టర్ల బృందం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
అరుదైన జబ్బుల బారిన పడే చిన్నారుల కోసం *నిమ్స్లో ఈ సేవలు అందుబాటులోకి రావడం పట్ల చిన్నారుల తల్లిదండ్రులు, డాక్టర్లు ఆనందం వ్యక్తం చేశారు. *Gaucher, Fabry, Pompe వంటి జెనెటిక్ వ్యాధులతో బాధపడే చిన్నారులకు తగిన చికిత్స అందించేందుకు సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ మరియు *డయాగ్నోస్టిక్ సహకారంతో *సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేశారు.
డాక్టర్లు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ జెనెటిక్ వ్యాధులు సాధారణంగా చిన్నారుల్లో పుట్టిన ఏడాది నుంచి ఆరేళ్ల వయస్సు లో కనిపిస్తాయి. ఈ వ్యాధులతో బాధపడే పిల్లలకు *గుండె, కాలేయ సమస్యలు, అలాగే *మానసిక పరిపక్వత లోపాలు వస్తాయి. ఈ రకాల వ్యాధులు గుర్తించిన వెంటనే వైద్య చికిత్స చేయకపోతే, వారి ప్రాణాలకు ముప్పు ఉండవచ్చని చెబుతున్నారు.
ప్రస్తుతం Gaucher వ్యాధితో బాధపడుతున్న 26 మంది చిన్నారులకు నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు వివరించారు. పిల్లల బరువు మరియు వయస్సు ఆధారంగా చికిత్స విధానాలు నిర్ణయించబడతాయి. ఈ NPRD పాలసీ ప్రకారం, ప్రతి చిన్నారి వైద్యానికి సుమారు రూ.50 లక్షల నిధులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేటాయిస్తుందని చెప్పారు.
Pompe వంటి జెనెటిక్ వ్యాధులతో బాధపడే పిల్లలకు గుండె వైఫల్యం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జెనెటిక్ వ్యాధులతో బాధపడే పిల్లలకు లైఫ్‌టైమ్ మెడిసిన్ అవసరమవుతుందని పేర్కొన్నారు.