టాలీవుడ్: రేడియో జాకీ గా ప్రయాణం ప్రారంభించి టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఉన్న హీరో స్టేజ్ కి ఎదిగాడు నాని. నాచురల్ స్టార్ అనే పేరు పొంది రక రకాల ప్రయోగాలతో పాటు అప్పుడప్పుడు
పక్కింటి కుర్రాడి పాత్రలు, కొంచం యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలు చేసుకుంటూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం నాని ‘బ్రోచేవారెవరు రా’,’మెంటల్ మదిలో’ లాంటి నాచురల్ అండ్ సెన్సిబుల్ ఎంటర్టైనర్ లు అందించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్న విషయం తెల్సిందే. ఈ రోజు ఆ సినిమా టైటిల్ ప్రకటించారు. రెగ్యులర్ టైటిల్ కాకుండా ఒక కొత్త రకమైన టైటిల్ అందులో ముఖ్యంగా నాని లుక్ సరికొత్తగా ఉండి ఆకట్టుకున్నాయి.
‘అంటే సుందరానికి’ అనే టైటిల్ విడుదల చేస్తూ ఒక చిన్న వీడియో కూడా విడుదల చేసారు. టైటిల్ తో పాటు నాని లుక్ కూడా కొత్తగా ఉంది. చిన్నప్పుడు చదువుకున్న బారిస్టర్ పార్వతీశం లుక్ లో వుంది. ముందు నుండి అనుకుంటున్నట్టు అలాగే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తాలూకు కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. అంతే కాకుండా తెలుగులో డైరెక్ట్ సినిమా చేయనప్పటికీ ఇక్కడ కూడా చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న మలయాళీ హీరోయిన్ నజ్రియా నజిమ్ ఈ సినిమాతో తెలుగు లో అడుగు పెట్టబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాని వెర్సటైల్ కంపోజర్ వివేక్ సాగర్ సంగీతాన్ని అందించనున్నాడు. టక్ జగదీశ్, శ్యామ్ సింఘరాయ్ తో పాటు ఈ సినిమాని కూడా కలిపి వచ్చే సంవత్సరం నాని మూడు సినిమాలతో అభిమానుల్ని పలకరించనున్నాడు.