fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsనేచురల్ స్టార్ నాని మరోసారి రెమ్యునరేషన్ పెంపు!

నేచురల్ స్టార్ నాని మరోసారి రెమ్యునరేషన్ పెంపు!

NATURAL-STAR-NANI-INCREASED-REMUNERATION-AGAIN
NATURAL-STAR-NANI-INCREASED-REMUNERATION-AGAIN

మూవీడెస్క్: నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ చిత్రాల విజయంతో మంచి ఫాంలో ఉన్న నాని, ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్‌లో ‘హిట్ 3’ మూవీలో బిజీగా ఉన్నాడు.

ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు, 100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుండటం విశేషం.

నాని కెరీర్‌లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, అతనికి అత్యధిక బడ్జెట్ చిత్రంగా నిలవబోతోంది.

ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

ఈ ప్రాజెక్టు తరువాత శ్రీకాంత్ ఒదేల డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని, ఆ మూవీ 2025 ప్రారంభంలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

వరుస విజయాల నేపథ్యంలో, నాని మార్కెట్ కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఆయన సినిమాలు 60 నుంచి 80 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నాని తన రెమ్యూనరేషన్‌ను కూడా పెంచినట్లు సమాచారం. ‘హిట్ 3’ తరువాత చేయబోయే చిత్రాలకు 35 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తోంది.

నాని మార్కెట్ రేంజ్ పెరిగినందున, నిర్మాతలు కూడా ఈ మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు.

‘హిట్ 3’ పాన్ ఇండియా హిట్ అయితే, నాని టైర్ వన్ హీరోల జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల అతని రెమ్యూనరేషన్ మరింతగా పెరగవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular