మూవీడెస్క్: నేచురల్ స్టార్ నాని కంటెంట్ బేస్డ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరో.
గతంలో జెర్సీ, దసరా, హై నాన్న వంటి కథా ప్రధాన చిత్రాలతో అలరించిన నాని, ఇప్పుడు మరో కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు టాక్.
ప్రస్తుతం హిట్ 3 మరియు ది ప్యారడైజ్ సినిమాలతో బిజీగా ఉన్న నాని, త్వరలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
గతంలోనూ నాని-శేఖర్ కమ్ముల కాంబోపై చర్చలు జరిగాయి కానీ, కథ సెట్టవ్వకపోవడంతో ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.
ఇప్పుడు మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ గురించి వార్తలు వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్‌తో కుబేర అనే పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాడు.
ఈ సినిమా పూర్తైన వెంటనే నాని సినిమాను పట్టాలెక్కించనున్నారని సమాచారం.
ఒకవేళ ఇది నిజమైతే, ఇద్దరి కాంబినేషన్‌లో ఓ నేచురల్ మాస్టర్‌పీస్ రానుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరి అధికారిక అనౌన్స్‌మెంట్ ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.