మూవీడెస్క్: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇటీవల విడుదలైన సరిపోదా శనివారం సినిమాతో మరో హిట్ సాధించిన నాని, తన అభిమానులను ఆకట్టుకున్నారు.
ఈ సినిమాలో నాని నటనపై ప్రశంసలు దక్కాయి, సూర్య అనే పాత్రలో ఆయన మరోసారి తన ప్రతిభను చాటారు.
ఇప్పుడు నాని తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో తన నెక్ట్స్ మూవీ అనౌన్స్మెంట్ కోసం అప్డేట్ ఇచ్చారు.
సెప్టెంబర్ 5న ఉదయం 11:04 గంటలకు ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోందని వెల్లడించారు.
“బ్లడీ ఊచకోత” అనే ట్యాగ్ తో ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి పెంచారు. ఈ అప్డేట్ తో పాటు, ఒక ప్రత్యేక పోస్టర్ ను కూడా నాని షేర్ చేశారు, అందులో ఆయన ఒక వాహనం స్టీరింగ్ పై పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.
ఇప్పటికే నాని 32 ప్రాజెక్ట్ పై కొంతమంది ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు, ముఖ్యంగా ఇది హిట్ సీరీస్ డైరెక్టర్ శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కుతుందా లేదా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనా అన్నది స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
నాని తనకు దసరా వంటి భారీ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ తో మరో సినిమా కూడా చేయబోతున్నట్లు వెల్లడించడంతో, కొత్త ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి పెరిగింది.