టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నాని ప్రయాణం గురించి తెల్సిందే. పెద్ద పెద్ద బడ్జెట్ లు ,పెద్ద పెద్ద హిట్ లు కాకపోయినా కానీ మినిమం గ్యారంటీ హీరో, సినిమా కొంచెం మంచిగా ఉంటే ఇంకా మంచి కలెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న మీడియం రేంజ్ హీరోల్లో నాని టాప్ లో ఉంటాడు. నాని ప్రస్తుతం తన 26 వ సినిమా ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వలో చేస్తున్నాడు. ఈ సినిమాని ‘టక్ జగదీశ్’ అనే టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తూ ఈ సారి ఫుల్ మీల్స్ అని నాని ట్వీట్ చేసాడు. ఫస్ట్ లుక్ మాత్రమే కాకుండా క్యారెక్టర్ పేరు జగదీశ్ నాయుడు అని కూడా తెలిపారు.
నీట్ గా టక్ చేసుకొని ముందు మీల్స్ పెట్టుకొని తినడానికి కూర్చున్నట్టు ఉన్న క్లాస్ లుక్ తో పాటు వెనక నుండి కత్తి తీస్తూ మాస్ ఎలెమెంట్స్ కూడా ఒకే లుక్ లో కవర్ చేసారు. ఈ సినిమాలో నాని రెండు పాత్రలు పోషిస్తున్నట్టు కూడా ఒక టాక్ ఉంది. ఈ సినిమాలో నానితో పాటు రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు .థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మజిలీ సినిమాని నిర్మించిన షైన్ మూవీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో ఈ సినిమాని 2021 ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు. ఈ సినిమాతో పాటు బ్రోచేవారెవరురా డైరెక్టర్ ‘వివేక్ ఆత్రేయ’ తో పాటు ‘సుందరాని కి ‘ అనే మరో సినిమాలో కూడా నాని నటిస్తున్నాడు.