fbpx
Saturday, January 18, 2025
HomeMovie News'నవరస' అంథాలజీ సిరీస్ టీజర్

‘నవరస’ అంథాలజీ సిరీస్ టీజర్

Navarasa ReleaseDate Announced

కోలీవుడ్: నేషనల్ వైడ్ గుర్తింపు పొందిన డైరెక్టర్ మణి రత్నం మరియు జయేంద్ర కలిసి తమిళ్ లో ఒక అంథాలజీ సిరీస్ ని నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ పేరు నవరస. 9 కథలు, 9 దర్శకులు అనే కాన్సెప్ట్ తో ఒక్కో కథ ఒక్కో భావానికి సంబంధించినదిగా ఉండనున్నట్టు తెలిపారు. అంతే కాకుండా ఈ సిరీస్ నుండి వచ్చిన ఆదాయం తమిళ ప్రజల సేవార్థం వాడనున్నట్టు తెలిపారు. ఈ సిరీస్ కోసం తమిళ్ లో ఉన్న అగ్ర తారలు, అగ్ర టెక్నీషియన్స్ పని చేసారు. ఈ రోజు ఈ సిరీస్ కి సంబందించిన టీజర్ తో పాటు విడుదల తేదీ ప్రకటించారు.

టీజర్ ని బ్లాక్ అండ్ వైట్ థీమ్ తో 9 భావోద్వేగాల్ని చూపించారు. సూర్య , ప్రకాష్ రాజ్, సిద్దార్థ్, రేవతి, విజయ్ సేతుపతి, అరవింద స్వామి, ఐశ్వర్య రాజేష్, బాబీ సింహ, యోగి బాబు, అదితి బాలన్, అధర్వ మురళి, గౌతమ్ మీనన్ తదితరులు ఈ సిరీస్ లో నటించనున్నారు. ఈ 9 కథలని అరవింద స్వామి, బిజోయ్ నంబియార్, గౌతమ్ మీనన్, కార్తీక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజ్, ప్రియదర్శన్, రతీంద్రన్ ప్రసాద్, సర్జన్ , వసంత సాయి దర్శకత్వం వహిస్తున్నారు. వీరితో పాటు పి.సి. శ్రీరామ్, ఏ.ఆర్ రెహమాన్ లాంటి అగ్ర టెక్నీషియన్స్ కూడా ఈ సిరీస్ లో పాలు పంచుకుంటున్నారు. ఆగష్టు 6 నుండి ఈ నవరస సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular