హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటుతున్న నవీన్ చంద్ర ఈసారి ‘ఎలెవన్’ అనే ఇంటెన్స్ థ్రిల్లర్‌తో మే 16న థియేటర్లలోకి రానున్నాడు. లోకేష్ ఏజెల్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది.
ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను హీరో నితిన్ తండ్రి, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్. సుధాకర్ రెడ్డి తీసుకోవడం సినిమాకు స్పెషల్ బూస్ట్ అయ్యింది. ఇప్పటికే అనేక హిట్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన ఈసారి ‘ఎలెవన్’కు బిగ్ రేంజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ బైలింగ్వల్ సినిమా కథ, మేకింగ్ మెరుగ్గా ఉండటంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. నవీన్ చంద్ర, అభిరామి, శశాంక్, కీర్తి దామరాజు, రవి వర్మ నటన సినిమాకు కీలకం కానుంది.
డైరెక్టర్ సుందర్ సి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేష్ ఏజెల్స్ ఈ చిత్రాన్ని స్టైలిష్‌గా తెరకెక్కించారు. సంగీతం డి. ఇమ్మాన్ అందించగా, కెమెరా కార్తిక్ అశోకన్, ఎడిటింగ్ శ్రీకాంత్ ఎన్.బీ చేశారు.
టెక్నికల్‌గా స్ట్రాంగ్, నవీన్ నటనకు బలంగా నిలబడే ఈ చిత్రం మే 16న థియేటర్లలో విడుదల కానుండగా, నితిన్ ఫ్యామిలీ సపోర్ట్ సినిమాకు అదనపు హైప్‌ను తెచ్చినట్టయింది.