టాలీవుడ్: ఈ సంవత్సరం ఆరంభం లోనే 2020 లో విడుదల చెయ్యాల్సిన దాదా సాహెబ్ అవార్డు గ్రహీతల్ని విడుదల చేసారు. 2019 లో విడుదలైన సినిమాలకి గానూ వివిధ కాటగిరీల్లో అవార్డులు ఎంపిక చేసి విడుదల చేసారు. తెలుగు లో ఉత్తమ నటనని కనబరచిన నటుడిగా నవీన్ పోలిశెట్టి కి దాదా సాహెబ్ అవార్డు లభించింది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలో నవీన్ నటనకి ఈ పురస్కారం లభించింది. ఆ సంవత్సరం లో చాలా సినిమాల్లో చాలా పెద్ద హీరోల నటన పోటీ లో ఉన్నా కూడా నవీన్ ఈ అవార్డు పొందడం నెక్స్ట్ జెనెరేషన్ కి కొత్త ఉత్సాహం ఇస్తుంది.
నాని జెర్సీ సినిమాకి ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో రష్మిక మందన్న నటనకి ఉత్తమ నటిగా అవార్డు లభించింది. సాహో సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరచినా కూడా డైరెక్టర్ సుజీత్ కి ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. ఎస్ ఎస్ థమన్ కి ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు లబింధించి. వెర్సటైల్ యాక్టర్ క్యాటగిరిలో అక్కినేని నాగార్జున కి అవార్డు లభించింది. తమిళ్ లో ధనుష్ కి అసురన్ సినిమాకి ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ఈ అవార్డుల్ని పరిశీలిస్తే యువత ని మరింత ఉత్తేజ పరిచేలా ఉన్నాయి.