మూవీడెస్క్: పాన్ ఇండియా స్టార్ యశ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా చేస్తున్న టాక్సిక్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
గీతూ మొహందాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కథ కొత్తగా, విభిన్నంగా ఉండబోతుందని సమాచారం.
యశ్ పాత్ర పూర్తిగా డిఫరెంట్ షేడ్స్ లో ఉంటుందని తెలుస్తోంది.
ఇటీవల ఈ సినిమా నటీనటుల ఎంపికలో మార్పులు జరగడం ప్రాజెక్ట్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది.
ఇది వరకు కరీనా కపూర్‌ను ఒక కీలక పాత్రకు ఎంపిక చేసిన మేకర్స్, కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకున్నారు.
యశ్‌తో పాటు నయనతార ఉండటం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.
జవాన్ వంటి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నయనతార, ఈ సినిమాలో కూడా తన సత్తా చాటనుంది.
ప్రస్తుతం నయనతార యశ్‌తో కీలక సీన్స్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
అదే సమయంలో, కియారా అద్వానీ కూడా యశ్‌కు జోడిగా నటిస్తుండడం మరో విశేషం.
నయనతార మరియు కియారాల కాంబినేషన్ ఈ సినిమాపై భారీ క్రేజ్ తీసుకొచ్చింది.
బాలీవుడ్ నటుడు అక్షయ్ ఓబెరాయ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.
యశ్, నయనతార, అక్షయ్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులకు హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.
మొత్తానికి, టాక్సిక్ కథ, మేకింగ్, మరియు భారీ తారాగణంతో పాన్ ఇండియా లెవెల్‌లో అత్యుత్తమ హిట్ అవుతుందనే నమ్మకం సినిమా బృందానికి ఉంది.
త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది.