‘తండేల్’తో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగచైతన్య, ఇప్పుడు పూర్తిగా కొత్త మేకోవర్‌తో మరో ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతున్నారు. #NC24 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న కొత్త సినిమా మిస్టరీ, మైథికల్ హారర్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతోంది.
ఈ సినిమాకు విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, సుకుమార్ రైటింగ్స్ సంస్థ ప్రెజెంట్ చేస్తుండటం సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.
కథ, కథనం, ఎమోషన్ అన్నింటిలోనూ వినూత్నత కోసం మేకర్స్ కృషి చేస్తున్నారని తెలుస్తోంది. చైతన్య పాత్రలో ఉన్న మలుపులు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
తండేల్‌లో ఫిషర్‌మన్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న చైతూ, ఈ సినిమాలో మాత్రం ఇంటర్నేషనల్ లుక్‌లో కనిపించనున్నారు. ట్రెండీ అవతారంతో పాటు ఎమోషనల్ డెప్త్ కలిగిన క్యారెక్టర్‌ను ఆయన పోషించబోతున్నారు. ఈ పాత్రలోని థ్రిల్ ఎలిమెంట్స్ స్క్రీన్ మీద ఓ ప్రత్యేక అనుభూతిని అందించనున్నాయని చిత్రబృందం చెబుతోంది.
ప్రస్తుతం అడవి ప్రాంతాల్లో కీలక షెడ్యూల్ జరుపుతున్న చిత్రబృందం, త్వరలోనే ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. థ్రిల్లింగ్ ట్రీట్‌కి రెడీ అవుతున్న నాగచైతన్యను మరోసారి కొత్త షేడ్స్‌లో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.