పట్నా : దేశ మొత్తం మీద ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం, ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా సాగుతోంది. ఇక అధికారంపై ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి తీవ్రమైన పోటీ ఇచ్చినప్పటికీ చాలా చోట్ల ఎన్డీయే జోరును తట్టుకోలేకపోయింది.
పట్నా పోరులో మరోసారి బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఎన్డీయే కూటమి ఊహించని విధంగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోనే జేడీయూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూప లేకపోయింది.
రాజనీతిలో చాణక్యుడిగా పేరు పొందిన నితీష్‌కు ఈసారి బిహార్ ఓటర్లు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు అర్థమవుతోంది. కాగా బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానియా బాగానే పనిచేస్తోంది. అంచనాలకు అందకుండా ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అనుహ్యమైన ఫలితాలను సాధించింది. ప్రస్తుతం వెల్లడైన ఫలితాల ప్రకారం, బిహార్ అసెంబ్లీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది, దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.