‘పదినారు వయదినిలే’ – భారత సినీ చరిత్రలో ప్రముఖంగా వినిపించే పేర్లలో సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి 1977 లో నటించిన సినిమా, దీనికి దర్శకత్వం భారతి రాజా. ఇప్పుడు ఈ సినిమాని డిజిటలైజ్ చేసి తెలుగు లో డబ్బింగ్ చేసి ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం 4 జాతీయ పురస్కారాలను కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా కమల్ హాసన్, ఉత్తమ దర్శకుడిగా భారతీరాజా, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా, ఉత్తమ నేపథ్య గాయనిగా ఎస్.జానకి జాతీయ పురస్కారాలను అందుకున్నారు. తెలుగు లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం లో ‘పదహారేళ్ళ వయసు’ పేరు తో రూపొందించబడి ఘనవిజయం సాధించింది.
ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో ‘నీకోసం నిరీక్షణ’ అనే టైటిల్ తో అధునాతన డాల్బీ సౌండ్ పద్ధతుల్లో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి అన్ని పాటలను మళ్లీ కొత్తగా పొందుపరచడం జరిగింది. ఈ చిత్రాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన అనంతరం మరో అయిదు భాషల్లో డబ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ కి మరియు తెలుగు ‘పదహారేళ్ళ వయసు’ క్లైమాక్స్ వెర్షన్ కి భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేసి తర్వాత ఇంకో 4 భాషల్లో విడుదల చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు నిర్మాతలు చెప్పుకొచ్చారు.