న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో నీట్ ఫలితాల తుది జాబితా విడుదలైనట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి.
ఎన్టీయే వెబ్‌సైట్‌లో నీట్ రివైజ్డ్ స్కోర్ కార్డ్ అని ఒక లింక్ కనిపించింది. దీంతో విద్యార్థులు ఫలితాలు చూసుకోవడానికి వెబ్‌సైట్ ను సందర్శించారు.
అయితే, ఆ లింక్ ఓపెన్ కాకపోవడంతో విద్యార్థుల్లో గందరగోలం నెలకొంది. దీంతో కేంద్ర విద్యాశాఖ ఈ విష్యం పై వివరణ ఇచ్చింది.
ఎన్టీయే వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నది పాత లింకే అని, ఆ లింక్ చూసి ఫలితాలు విడుదలైనట్టుగా భావించడంలో పొరబాటు జరిగిందని తెలిపింది.
కాగా, సవరించిన స్కోర్ కార్డులు ఇంకా విడుదల చేయలేదని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది.
విద్యార్థులు ఇలాంటీ అపోహలకు గురి కాకుండా విద్యాశాఖ నుండి అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలని కోరింది.