న్యూ ఢిల్లీ: ఇప్పటికే భారత్ భూభాగాన్ని తమ మ్యాప్ లో చూపించుకున్న నేపాల్ తాజాగా మరో చర్యకు ఉపక్రమించింది. నేపాల్ కేబుల్ ఆపరేటర్లు భారత్ కు సంబంధించిన టీవీ చానళ్ళ ప్రసారాన్ని నిలిపెవేస్తున్నట్లు ప్రకటించారు.
భారత్ కు సంబంధించిన అన్ని టీవీ చానళ్ళ ప్రసారాన్ని ఆపేస్తున్నామని, కేవలం దూరదర్శన్ ప్రసారాన్ని మాత్రమే చేస్తామని ప్రకటించారు అక్కడి కేబుల్ ఆపరేటర్లు. అయితే ఈ నిర్ణయం తాము స్వచ్చంధంగా తీసుకున్నదేనని, దీనిలో నేపాల్ ప్రభుత్వ జోక్యం లేదని పేర్కొన్నారు.
భారత్ టీవీ చానళ్ళలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ గురించి అసత్య ప్రసారాలు చేస్తున్నారని ఆ దేశ మాజీ డిప్యూటి ప్రధాని మరియు అధికార పార్టీ ప్రతినిధి అయిన నారాయణ కేజీ శ్రేష్ట ప్రకటించిన కాసేపటికే కేబుల్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. నేపాల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇది ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరిగిందనేది సుస్పష్టం.
అయితే ప్రపంచానికి ఇదంతా చైనా పని అనేది చెపక్కనే అర్థమయ్యే అంశం. చైనా ఒక పక్క నుండి కయ్యానికి కాలు దువ్వుతూనే పొరుగు దేశాలను కూడా భారత్ పైకి కాలు దువ్వేలా చేస్తోంది. ఒక వైపు స్నేహ ఒప్పందాలు, సంధి ప్రయత్నాలు చేస్తునే మరో వైపు ఇతరులను భారత్ పైకి ఉసిగొల్పే పనిలో నిమగ్నమయ్యింది