ఖాట్మాండు: నేపాల్ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి ఆ దేశ పార్లమెంట్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికల తేదీలను కూడా ప్రకటించారు. నవంబర్ 12, 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని అధ్యక్షురాల ఆదేశాలు జారీ చేశారు. దీనికి ముందు శుక్రవారం సాయంత్రంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలికి, ప్రతిపక్షాలకు ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి గడువు ఇచ్చారు.
ఆ రెండు పక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు విద్యాదేవి భండారి ఇవాళ అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ ఎన్నికల మొదటి దశ నవంబర్ 12న, రెండవ దశ ఎన్నికలు 19వ తేదీన జరగనున్నాయి. తనకు 153 మంది సభ్యలు మద్దతు ఉందంటూ ప్రధాని మంత్రి కేపీ శర్మ ఓలి ప్రకటించారు.
ఆయనకు 121 మంది సభ్యులతో పాటు, జేఎస్‌పీఎన్‌కు చెందిన మరో 32 మంది సభ్యుల మద్దతు కూడా ఉందని తెలిపారు. వారు తమ బలాన్ని సభలో రుజువు చేయడంలో విఫలమైన నేపథ్యంలో ఈ సంక్షోభం మొదలైంది. కేపీ శర్మ ఓలి బలాన్ని రుజువు చేసుకోవడంలో కూడా విఫలం కావడంతో ప్రతిపక్షాలను ప్రభుత్వం ఏర్పా టు చేయాల్సిందిగా అధ్యక్షురాలు పిలుపునిచ్చారు.
అధికార పక్షం తో పాటు ప్రతిపక్షాలు కూడా సంకీర్ణ కూటమి ఏర్పాటు చేయడంలో విఫలం చెందాయి. నేపాల్ పార్లమెంట్‌లో 275 సీట్లు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 136 మంది సభ్యుల మద్దతు అవసరం.