న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి మరియు లాక్డౌన్ ఉన్నప్పటికీ, అనేక కొత్త కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. కేవలం జూలైలోనే 5 కొత్త కార్ లాంచ్‌లు జరిగాయి. ఇప్పుడు ఆగష్టులో కూడా అదేవిధంగా కొత్త కార్లు రాబోతున్నాయి.
దేశం కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతూనే ఉంది, ప్రజలు కొత్త జీవన విధానానికి అనుగుణంగా బ్రతకడం ప్రారంభించారు. కఠినమైన పరిశుభ్రత ప్రోటోకాల్‌లు మరియు సామాజిక దూరం పాటించడం ఖచ్చితం అయిపొయింది. ఇక తయారీదారులు మరియు పరిశ్రమ నిపుణులు ఈ పరిస్థితిని బట్టి, భద్రతను పెంచడానికి, వినియోగదారులలో వ్యక్తిగత చైతన్యం కోసం పెరుగుతున్న డిమాండ్ కి అనుగుణంగా ఉత్పత్తులు ప్రారంబించారు.
ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన కార్ అండ్ బైక్ సర్వేలో కూడా ఇది నిర్ధారించబడింది. ఈ భావనతో ప్రోత్సహించబడిన తయారీదారులు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు మరియు కేవలం జూలైలోనే 5 కొత్త కార్ లాంచ్లను చేశాయి. ఆగస్టు కూడా ఇదే విధంగా ఉండబోతోందని సమాచారం.
రాబోయే కొత్త మోడల్ కార్లు ఇవే:
- 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్
- హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్
- మెర్సిడెస్ బెంజ్ EQC
- రెనాల్ట్ డస్టర్ 1.3 టర్బో పెట్రోల్
- కియా సోనెట్
మరి రాబోయే ఈ కొత్త కార్లు మార్కెట్లో ఎలా కొనుగోల్లు నమోదు చేస్తాయో వేచి చూడాలి అంటున్నారు మార్కెట్ నిపుణులు.