మూవీడెస్క్: ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ లో కొత్త కథల కోసం వేచి చూస్తున్నారు. భాషల భేదం లేకుండా, ప్రతి వారం ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఈ వారం తెలుగు సహా వివిధ భాషలలో విడుదలైన కంటెంట్ పట్ల మంచి ఆసక్తి నెలకొంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో డిసెంబర్ 13న విడుదలైన ‘హరికథ’ తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటోంది.
అలాగే ‘డ్రీమ్ ప్రొడక్షన్స్’ వెబ్ సిరీస్ డిసెంబర్ 11న వచ్చింది. హాలీవుడ్ మూవీ ‘ఎల్టన్ జాన్’ కూడా ఇదే వేదికపై విడుదలై ప్రేక్షకుల్ని ఆకర్షిస్తోంది.
అమెజాన్ ప్రైమ్ లో రోహిత్ శెట్టి మల్టీస్టారర్ ‘సింగం ఎగైన్’ డిసెంబర్ 12న ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది.
హిందీ సిరీస్ ‘బండిష్ బండిట్స్ 2’ డిసెంబర్ 13న విడుదలై పాజిటివ్ టాక్ సంపాదిస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ లో ‘తంగలాన్’ (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం) డిసెంబర్ 10న విడుదలై ట్రెండింగ్ లో నిలిచింది.
‘ది షేప్స్ ఆఫ్ లవ్’, ‘మిస్ మ్యాచ్‌డ్ 3’, ‘నో గుడ్ డీడ్’ వంటి సిరీస్ లు ట్రెండింగ్ లో ఉన్నాయి.
ఇతర ప్లాట్‌ఫార్మ్ లలో సోనీ లివ్ ‘బొగెన్ విల్లా’, జీ5 ‘డిస్పాచ్’ థ్రిల్లర్ వంటి కంటెంట్ అందుబాటులోకి వచ్చింది.
ఇకపోతే కొత్త సంవత్సరానికి ముందు వీక్షకులకు కంటెంట్ విందు సిద్ధమవుతోంది.