షిన్‌జియాంగ్ : చైనా అంటే ఒకప్పుడు నకిలీ ఉత్పత్తులు తయారు చేసే దేశంగా పెరుండేది. ఇప్పుదు కరోనా వైరస్ వల్ల ఆ పేరు కాస్తా వైరస్ లకు పుట్టిల్లు గా మారింది. కరోనా వచ్చిన మొదట్లో ఒక కామెంట్ నెట్టింట్లో బాగ షికార్లు చేసింది.చైనా తయారు చేసే వస్తువులు ఎక్కువ రోజులు పని చేయవు, కానీ చైన చేసిన వైరస్ మాత్రం బాగా పని చేస్తోంది అని.
వుహాన్‌లో మొదలైన ఈ కరోనా వైరస్ ఖండాంతరాలను దాటి ఇప్పటికి విజృంభిస్తోనే ఉంది. చైనాలో కొంతకాలంగా రెండకెల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. కాగా తాజాగా బుధవారం కొత్తగా మూడంకెల 101 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మరోసారి కేసుల సంఖ్య పెరుగుతన్నట్లుగా కనిపిస్తోంది.
వుహాన్‌లో మొదలైన ఈ కరోనా వైరస్ ఖండాంతరాలను దాటి ఇప్పటికి విజృంభిస్తోనే ఉంది. చైనాలో కొంతకాలంగా రెండకెల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. కాగా తాజాగా బుధవారం కొత్తగా మూడంకెల (101) కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మరోసారి కేసుల సంఖ్య పెరుగుతన్నట్లుగా కనిపిస్తోంది.
గత మూడు నెలల్లో ఒకేరోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. చివరిగా చైనా లో ఏప్రిల్ 13న ఒక్కరోజే 108 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆదేశ జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. కాగా కొత్త కేసుల్లో 89 షిన్‌జియాంగ్ ప్రాంతంలోనే నమోదయ్యాయి.
ఎక్కువ కేసులు బయటపడుతున్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయడంతో పాటు భారీ స్థాయిలో కరోనా పరీక్షలు కూడా చేపడుతున్నారు. ఒక్క బీజింగ్‌లోనే దాదాపు 10 లక్షల పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు కొత్త కేసులతో కలుపుకొని చైలో మొత్తం 84,060 కరోనా కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 4,634గా ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కోటి 67 లక్షల మందికి వైరస్ సోకగా.. 6లక్షల 60వేల మంది మరణించారు.