అమరావతి: ఏపీలో ఇప్పుడిప్పుడే జిల్లాల పునర్వ్యస్థీకరణ అంశం ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. రాబోయే వారం రోజుల్లో దీనికి సంబంధించి తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కొత్త జిల్లాలకు అవసరమైన కార్యాలయాలను
అధికారులు ఇప్పటికే గుర్తించారు.
ఏపీలో నూతనంగా ఏర్పాటవనున్న 13 జిల్లాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఉగాది రోజున (ఏప్రిల్ 2వ తేదీ) లాంఛనంగా ప్రారంభించనున్నారు. కొత్త జిల్లాలకు కలెక్టర్, ఒక జేసీ మరియు ఎస్పీని ప్రభుత్వం నియమించనుంది.
ఈ జిల్లాల ఏర్పాటు వల్ల రెవెన్యూ డివిజన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. పోలీస్ శాఖలోనూ విభజనకు కసరత్తులు ఇప్పటికే జరుగుతున్నాయి. మరోవైపు ఆర్థిక శాఖ కూడా ఉద్యోగుల విభజన అంశాన్ని పూర్తి చేసే పనిలో ఉంది.
ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలో కొన్ని జిల్లాల పేర్లు మార్పు, కొన్ని మండలాల జిల్లాల మార్పులు వంటి అంశాలను ప్రభత్వుం పరిశీలిస్తోంది.