మూవీడెస్క్: ఇటీవల సినీ ఇండస్ట్రీలోకి నట వారసుల ఎంట్రీ గురించి చర్చలు పెరిగిపోతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మహేష్ బాబు టాలీవుడ్ లో అగ్ర హీరోగా స్థిరపడిగా, ఇప్పుడు తదుపరి జనరేషన్ కూడా రెడీ అవుతోంది.
ముఖ్యంగా రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ తన తొలి అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఇటీవల ఆయన ఫోటో వైరల్ అవ్వడంతో, జయకృష్ణ ఎంట్రీపై ఆసక్తి మరింత పెరిగింది.
అయితే, మరింత ఆసక్తికరంగా మహేష్ కూతురు సితార, తన సోదరుడు గౌతమ్ కూడా సినీ రంగంలోకి రావాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది.
గౌతమ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ లో నాలుగేళ్ల పాటు యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడని, ఆ తర్వాత తన సినీ ప్రయాణం మొదలవుతుందని చెప్పింది.
ఇదే సమయంలో, సితార కూడా తాను యాక్టింగ్ లో ఉన్న ఆసక్తిని పలుమార్లు వ్యక్తం చేసింది. ఇటీవల ఒక జ్యువెలరీ యాడ్ లో కనిపించిన ఆమె, ఇప్పటికే తనకంటూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
గౌతమ్ కూడా సినీ రంగంలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతుండటంతో, మహేష్ బాబు వారసుల నుంచి మరిన్ని అప్డేట్లు వచ్చే అవకాశముంది.