మూవీడెస్క్: ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల సలార్, కల్కి 2898 ఎడీ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.
ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్ 2,’ ‘రాజా సాబ్,’ ‘స్పిరిట్’ వంటి చిత్రాల్లో నటిస్తుండగా, సీతా రామం ఫేమ్ హను రాఘవపూడితో ఓ పీరియాడికల్ రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు.
హను దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో మొదటి హీరోయిన్‌గా ఇమాన్వీని ఎంపిక చేశారు.
అయితే తాజా సమాచారం ప్రకారం, సెకండ్ హీరోయిన్ పాత్రలో మలయాళ భామ నమిత ప్రమోద్ నటించనుందని తెలుస్తోంది.
నమిత ఇప్పటికే ‘చుట్టాలబ్బాయి,’ ‘కథలో రాజకుమారి’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.
ఇక చాలా గ్యాప్ తర్వాత ఆమె ప్రభాస్‌తో నటించే అవకాశం పొందడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.