ఢిల్లీ: భారత క్రికెట్‌లో తాజా మార్పులు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. సిడ్నీ టెస్టు తర్వాత రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది.
అలాగే, వన్డే ఫార్మాట్‌కు హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటించనున్నట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు హార్దిక్ సారథ్య బాధ్యతలు తీసుకుంటే, రోహిత్ రిటైర్మెంట్ ప్రకటన చేయవచ్చని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే టీ20 సారథిగా సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతుండగా, వన్డేలకు హార్దిక్, టెస్టులకు బుమ్రాను పూర్తి స్థాయి కెప్టెన్లుగా కొనసాగించే అవకాశముంది.
ఇలాంటి మూడు ఫార్మాట్లకు వేర్వేరు నాయకత్వం భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి జరగనుంది.
ఈ మార్పులతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకవచ్చని సమాచారం. ఈ పరిణామాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.