అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొలువుతీరిన కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ శాఖలను కేటాయించారు. మంత్రులు గా ప్రమాణ స్వీకారఒ చేసిన ఇద్దరు సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు శాఖలను కేటాయించారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే క్రమంలో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
నూతన మంత్రులకు, పాత మంత్రులకు శాఖలలో జరిగిన మార్పులు చేర్పులు:
- మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు, రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు.
- మంత్రి శంకర్ నారాయణకు రోడ్లు, భవనాల శాఖను కేటాయించారు.
- నూతన మంత్రి సీదిరి అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖ బాధ్యతలు అప్పగించారు.
- మరో నూతన మంత్రి వేణుగోపాలకృష్ణకు బీసీ సంక్షేమ శాఖను కేటాయించారు.
కాగా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మత్య్స, పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో.. వారు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి విదితమే.