కరోనా కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్లు మూసివేత శత దినోత్సవం పూర్తి చేసుకుంది. నష్టాలు భరించలేని కొంతమంది నిర్మాతలకు ఓటీటీ ఒక దారి చూపెడుతుంది. కానీ ఇది తక్కువ బడ్జెట్ సినిమాకే వర్తిస్తుంది. కొన్ని సినిమాలు ఇప్పటికే ఓటీటీ ల్లో విడుదల అయినా కూడా ఆశించినంత స్పందన అయితే లేదు. పరిస్థితులని చూస్తే ఇప్పుడప్పుడే థియేటర్లు తెరిచే జాడ కనపడకపోవడం తో చాలామంది నిర్మాతలు తమ సినిమాలని ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం పెద్ద సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల చేస్తున్నారు.
ఇపుడే డిస్నీ హాట్స్టార్ నెట్వర్క్ వాళ్ళు రాబోవు రోజుల్లో ఓటీటీ సినిమా సునామి సృష్టించబోతున్నారు. వాళ్ళు వరుసగా 7 సినిమాలు ఓటీటీ లో విడుదలకి సిద్ధం చేసారు. ఇందులో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మి బాంబ్, ఇది కాంచన సినిమాకి రీమేక్, ఈ సినిమాకు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ దేవగణ్ నటించిన ‘భుజ్’ చిత్రం, 1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యయంలో సాగే ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్ర పోషించాడు.అభిషేక్ బచ్చన్ మూవీ ‘బిగ్ బుల్’, ఆలియా భట్ మూవీ ‘సడక్-2’ , విద్యుత్ జమాల్ మూవీ ‘ఖుదా హాఫిజ్’ , కామెడీ మూవీ ‘లూట్కేస్’, వీటితో పాటు సుశాంత్ నటించిన చివరి సినిమా ‘దిల్ బెచారా’ కూడా డిస్నీ హాట్స్టార్ వాళ్ళు విడుదల చేస్తున్నారు.