మూవీడెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌తో రాబోతున్న SSMB29 పై ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.
పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్ కోసం జక్కన్న ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు టాక్.
ఇప్పటివరకు కథ రాసుకుని రెడీ అయ్యారనే సమాచారం బయటకు వచ్చినా, ఇంకా అధికారిక అప్డేట్ మాత్రం రాలేదు.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి.
‘బాహుబలి’ తరహాలోనే ‘SSMB29’ను కూడా భాగాలుగా విభజిస్తే, భారీ బడ్జెట్ పెట్టుబడిని సులభంగా రికవర్ చేయొచ్చనే వ్యూహం ఉందని తెలుస్తోంది.
సినిమాను 1500 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ నటులను కూడా కాస్ట్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తీసుకురావాలనుకుంటున్నారు.
అయితే ఒకే ఒక సినిమా కోసం మహేష్ బాబు చాలా ఏళ్ళు ఫిక్స్ అవుతారనే విషయంలో మాత్రం ఫ్యాన్స్ మిక్స్డ్ ఫీలింగ్స్ వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా, జక్కన్న పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఈ ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తారని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
మరి ఈ తాజా ప్రచారం ఎంతవరకు నిజమో చూడాలి.