fbpx
Saturday, December 28, 2024
HomeMovie Newsపుష్ప 2 హైప్ కోసం బన్నీ టీమ్ స్పెషల్ స్ట్రాటజీ

పుష్ప 2 హైప్ కోసం బన్నీ టీమ్ స్పెషల్ స్ట్రాటజీ

NEW-STRATEGIES-FOR-PUSHPA-2-RELEASE
NEW-STRATEGIES-FOR-PUSHPA-2-RELEASE

మూవీడెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి మొదటి రోజే 200 కోట్ల పైగా కలెక్షన్స్ రావొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అలాగే నవంబర్ 17న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు, దాని ద్వారా సినిమా మీద హైప్ మరింత పెరగాలని మేకర్స్ ఆశిస్తున్నారు.

ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు యూఎస్ లో పుష్ప మూవీని నవంబర్ 19న రీరిలీజ్ చేయనున్నారు.

‘పుష్ప 2’కి మరింత ఆసక్తి రేకెత్తించడానికి ఈ రీరిలీజ్ తో సహాయపడుతుందని భావిస్తున్నారు.

మొదటి భాగం యూఎస్ లో మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ, ఈసారి ‘పుష్ప 2’ని మరింత స్ట్రాంగ్ గా ప్రమోట్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈసారి 20 మిలియన్ డాలర్ల టార్గెట్ తో ‘పుష్ప 2’ యూఎస్ లో విడుదల కానుంది, అందులో భాగంగా రీరిలీజ్ థియేటర్లలో కొత్త ట్రైలర్ ని కూడా ప్రదర్శించనున్నారు.

దీనివల్ల మరింత మందికి పుష్ప 2 చేరువ అయ్యే అవకాశం ఉంది.

ఇక, ఇండియాలో కూడా పుష్పను తిరిగి రిలీజ్ చేయడం ద్వారా మరింత ప్రోమోషన్ జరగొచ్చని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular