మూవీడెస్క్:యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో వస్తున్న దేవర సినిమాపై ప్రేక్షకుల అంచనాలు పీక్ స్టేజ్‌లో ఉన్నాయి.
ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండటం బాలీవుడ్ లో కూడా సిమిమకి మంచి క్రేజ్ ఏర్పడింది.
ఇప్పటికే లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్, సైఫ్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారని హింట్ ఇచ్చింది.
ఇక వచ్చే ఆగస్టు 15న సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా, సినిమా యూనిట్ ఆయన పాత్రకు సంబంధించిన ఒక పవర్ఫుల్ ఇంట్రో గ్లింప్స్‌ను విడుదల చేయనుందని సమాచారం.
సైఫ్ ఈ చిత్రంలో భైర అనే పాత్రలో కనిపించనుండగా, ఈ పాత్రకు దేవర పాత్రతో ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంటుందట.
కొరటాల శివ సృష్టించే పాత్రలకు ఒక ప్రత్యేకత ఉంటుంది, పాత్రలలో దాగి ఉండే ఎమోషన్‌ను హైలెట్ చేయడంలో ఆయన దిట్ట.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంటుండగా, మేకర్స్ తదుపరి అప్డేట్స్ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. “దేవర” మొదటి భాగం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.