తెలంగాణ: యూనిలివర్ పెట్టుబడులతో తెలంగాణ పెట్టుబడుల రంగంలో కొత్త ఒరవడి
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ‘ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్’ థీమ్‌తో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రైజింగ్ నినాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విస్తృత చర్చలు నిర్వహిస్తోంది.
ఈ సదస్సులో ప్రముఖ బహుళజాతి సంస్థ యూనిలివర్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. ఈ క్రమంలో యూనిలివర్ సీఈవో హీన్ షూమేకర్, చీఫ్ సప్లై చెయిన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.
యూనిలివర్ సంస్థ కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌ను స్థాపించేందుకు అంగీకరించింది. అలాగే రాష్ట్రంలో బాటిల్ క్యాప్స్ తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది.
తెలంగాణ పెవిలియన్‌లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ ఎజిలిటీ ఛైర్మన్ తారెక్ సుల్తాన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల ఆదాయాన్ని పెంచడం పై సమగ్ర చర్చలు జరిగాయి.
కాలిఫోర్నియాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ సాంబనోవా సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూలేతో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమల పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ భేటీల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కొత్త అవకాశాలను తెరుస్తోంది.