పూణే: New Zealand vs India: Day 3: భారత జట్టు 12 ఏళ్లపాటు స్వదేశంలో కొనసాగించిన టెస్ట్ సిరీస్ విజయాల పరంపరకు తెర పడింది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0తో కైవసం చేసుకుంది.
పుణేలో జరిగిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ దెబ్బకు భారత జట్టును 113 పరుగుల తేడాతో ఓడిపోయింది.
359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 8 పరుగులకు అవుట్ అయ్యాడు.
అయితే, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లు మొదట్లో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత జట్టుకు పునరుత్తేజం వచ్చింది.
కానీ, సాంట్నర్ వరుసగా వికెట్లు తీసి భారత్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు.
భారత జట్టు 245 పరుగులకే ఆలౌట్ అవడంతో 113 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది.
న్యూజిలాండ్‌కు బౌలింగ్‌లో సాంట్నర్ అద్భుత ప్రదర్శన చేస్తూ మొత్తం 7 వికెట్లు, 6 వికెట్లు తీసి భారత బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు.
అజాజ్ పటేల్ కూడా రెండు వికెట్లు తీసి తన పాత్ర పోషించాడు. భారత్ తరఫున యశస్వి జైస్వాల్ 77 పరుగులు, రవీంద్ర జడేజా 42 పరుగులు చేశారు.