టాలీవుడ్: తెలుగు ప్రాంతాల్లో సంక్రాంతి అంటే కోడి పందాలు ఫేమస్. అలాగే సంక్రాంతి పండగ సీజన్ తెలుగు సినిమాలకి కూడా మంచి బిజినెస్ టైం. ఆ సీజన్ లో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు చాలా రోజుల ముందుగానే ప్రయత్నాలు చేస్తుంటారు. టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం ఎంత కాదన్న సంక్రాంతి వారంలో కనీసం మూడు సినిమాలు విడుదల అవుతాయి. ఈ సంవత్సరం మొత్తం మీద టాలీవుడ్ మార్కెట్ సూపర్ హిట్ అంటే కేవలం సంక్రాంతి మాత్రమే. ఆ తర్వాత కరోనా వల్ల, లాక్ డౌన్ వల్ల సినిమాలేవీ విడుదల అవలేదు. ఇప్పుడిపుడే పరిస్థితులు మెరుగుపడడం తో షూటింగ్ ముగిసిపోయినవి, చివరి దశలో ఉన్న సినిమాలన్నీ సంక్రాంతి విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు మేకర్స్.
ఈ వరుసలో ముందుగా దగ్గుబాటి నటించిన బహుభాషా చిత్రం ‘అరణ్య’ ఉంది. రానా ముందు గానే సంక్రాంతి రిలీజ్ అని విడుదల తేదీ ప్రకటించాడు. ఆ తర్వాతి వరుసలో రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’ ఉన్నాయి. పోలీస్ థ్రిల్లర్ గా రాబోతున్న రవితేజ క్రాక్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ ద్విపాత్రాభినయంలో ‘రెడ్’ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతి కి విడుదల అవుతాయని మొన్న దసరా కి ప్రకటించారు. ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, కేజిఎఫ్ చాప్టర్ 2 , అక్కినేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’ మరియు సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ కూడా సంక్రాంతి సీజన్లో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్.