కోలీవుడ్: తమిళ సినిమా ఇండస్ట్రీ లో బాగా సక్సెస్ అయిన బ్రదర్స్ అంటే ఎక్కువగా వినిపించే పేర్లు సూర్య మరియు కార్తీ. వీళ్ళ కంటే ముందు మరొక బ్రదర్ పెయిర్ అద్భుతమైన విజయాల్ని సాధించింది. అదే ‘ధనుష్’ మరియు ‘సెల్వరాఘవన్‘. ధనుష్ ఒక అద్భుతమైన నటుడిగా నేషనల్ అవార్డు మరియు హాలీవుడ్ సినిమాల్లో నటించిన మొదటి సౌత్ హీరోగా కూడా పేరు గాంచాడు. బాలీవుడ్ లో కూడా సౌత్ నుండి డైరెక్ట్ హిందీ మూవీ తీసి హిట్ కొట్టిన ఘనత కూడా ధనుష్ కి ఉంది.
విభిన్నమైన, కొత్తదనం తో కూడిన సినిమాలు తియ్యడం లో సిద్ధహస్తుడు సెల్వ రాఘవన్. తెలుగులో ‘7 /G బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకి అర్థాలే వేరులే‘ లాంటి సినిమాల ద్వారా ఈ దర్శకుడు ఇక్కడ కూడా కొంత మందికి సుపరిచితమే. ప్రస్తుత కాలానికి ఒక పది సంవత్సరాల తర్వాత ఉండే విజన్ తో కథలని రూపొందిస్తాడు సెల్వ. ఆలా కొన్ని సినిమాలు జనాలకి అర్ధం కాక ప్లాప్ లుగా మిగిలాయి. కొన్ని సంవత్సరాల తర్వాత జనాలు టీవీ ల్లో వాటిని ఆదరించి సెల్వ ని అప్పుడు పొగుడుతూ ఉంటారు.
ప్రస్తుతం ఈ ఇద్దరు బ్రదర్స్ మరొకసారి కలిసి పని చేయనున్నారు. వీరిద్దరు ఇదివరకే మూడు సినిమాలకి కలిసి పని చేసారు. వీరి కాంబినేషన్ లో ‘కాదల్ కొండెన్’ (తెలుగు లో అల్లరి నరేష్ ‘నేను’), ‘పుదు పేట్టై’, ‘మయకం ఎన్న’ లాంటి సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు విభిన్నమైన పాత్రలు, విభిన్నమైన కథలతో రూపొందాయి. వీరితో పాటు యువన్ శంకర్ రాజా కూడా మరోసారి వేళ్ళతో కలిసి పనిచేయనున్నాడు. వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమా కూడా మంచి హిట్ సాధించి సెల్వ రాఘవన్ మళ్ళీ పూర్వ ఫార్మ్ లోకి రావాలని ఆశిద్దాం.