అబుదాబి: ఉత్రంఠ పోరులో న్యూజిలాండ్ పై చేయి సాధించింది. ఇంగ్లండ్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 లో ఫైనల్ కు దూసుకెళ్ళింది. 2019 లో ఐసీసీ వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో ఎదురైన ఓటమికి ఇప్పుడు బదులిచ్చింది.
తొలుత బ్యాటింగ్ చేసి 167 పరుగుల లక్ష్యాన్ని విధించింది ఇంగ్లండ్. కాగా చేధనలో న్యూజిలాండ్ పవర్ ప్లేలోనే రెండు ముఖ్యమైన వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిండి. విలియంసన్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన కాన్వే, ఓపెనర్ మిచెల్ తో కలిపి జాగ్రత్తగా ఆడుతూ అప్పుడప్పుడు బౌండరీలతో స్కోరు వేగాన్ని పెంచాడు.
కాన్వే అవుటయ్యాక మిచెల్ ఇంకా దూకుడు పెంచి (72 పరుగులు, 47 బంతులు; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విజయం వైపు వెళ్ళాడు. చివరిలో నీషం 3 సిక్సులు బాది న్యూజిలాండ్ ను విజయ తీరాలకు చేర్చాడు. దీంతో ఫైనల్ చేరిన తొలి జట్టుగా న్యూజిలాండ్ మారింది. తదుపరి సెమీస్ మ్యాచ్ పాకిస్తాన్ మరియు ఆస్ట్రేలియా మధ్యన జరగనుండగా వీరిలో గెలిచిన వాళ్ళు న్యూజిలాండ్ తో తలపడతారు.