వెల్లింగ్టన్: న్యూజిలాండ్ అంతర్జాతీయ క్రికెట్ టీంకు చెందిన పేసర్ హమీష్ బెన్నెట్ ఇవాళ అన్ని రకాల క్రికెట్ ఫార్మట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు తన నిర్ణయాన్ని ఏప్రిల్ 12వ తేదీన వెల్లడించాడు.
బెన్నట్ 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్‌కు చెందిన 19 వన్డే మ్యాచ్ లు,11 టీ20 మ్యాచ్ లు, ఆడాడు. మూడు ఫార్మాట్లు కలిపి అతడు కేవలం 43 వికెట్లు మాత్రమే తీశాడు.అయితే అంతర్జాతీయ స్థాయిలో అతడు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచ లేక పోయాడు.
అయితే అతను 2011 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టుకు ఎంపికైనప్పటికీ, గాయం కారణంగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. అతను తన రిటైర్మెంట్ ప్రకటనలో నాకు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే మక్కువ. అయితే నేను నా కెరీర్లో ఈ స్థాయికి చేరుకుంటానని కలలో కూడా అనుకోలేదు. కాంటర్బరీ క్రికెట్,న్యూజిలాండ్ క్రికెట్ ధన్యవాదాలు. ముఖ్యంగా న్యూజిలాండ్ తరపున ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వంగా ఉంది” అని బెన్నెట్ పేర్కొన్నాడు.