హైదరాబాద్: తెలుగులో బెట్టింగ్ యాప్‌ల ప్రభావం పెరుగుతుండగా, వీటి ప్రచారంలో సెలబ్రిటీలు కూడా భాగమవుతుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికే పలువురు యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం వల్ల కేసులు నమోదయ్యాయి.
ఈ విషయంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నేరుగా స్పందిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ ‘జీత్ విన్’ అనే యాప్‌ను ప్రమోట్ చేస్తూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ యాప్ కూడా బెట్టింగ్‌తో సంబంధం ఉందని, నిధి అగర్వాల్‌ను కూడా విచారించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
బెట్టింగ్ యాప్‌ల వల్ల యువత ఆర్థికంగా దెబ్బతింటుండటం, కొందరు జీవితాలు కోల్పోవడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారాలు నిధి అగర్వాల్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది ఆసక్తిగా మారింది.