టాలీవుడ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మరొక క్రేజీ సినిమా ‘హరి హర వీర మల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. సినిమాల్లోకి కం బ్యాక్ అయ్యాక వరుసగా రీమేక్ లే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ముందు వకీల్ సాబ్, ఇపుడు భీమ్లా నాయక్. ఈ మధ్యనే భీమ్లా నాయక్ టీజర్ తో యు ట్యూబ్ రికార్డ్స్ సృష్టించాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న డైరెక్ట్ మూవీ ‘హరి హర వీర మల్లు’. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటి చారిత్రాత్మక సినిమా ఇది. ఈ సినిమాలో ఒక చారిత్రక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం కత్తి యుద్దాలు కూడా బాగానే నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రేయసి పాత్రలో నిధి అగర్వాల్ నటిస్తుంది. ఇప్పటి వరకు నిధి కి సంబందించిన లుక్ కానీ పోస్టర్ కానీ, టీజర్ లో కూడా ఎక్కడ నిధి కన్పించలేదు. ఈ రోజు నిధి అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా నిధి అగర్వాల్ కి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు సినిమా టీం. క్లాసికల్ డాన్సర్ లోక్ లో నిధి లుక్ అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవచ్చు. పంచమి పాత్రలో చాలా ట్రెడిషనల్ గా నిధి కనిపిస్తుంది. మేఘ సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ.ఎం.రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంవత్సరం వేసవికి ఈ సినిమా సిద్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయి.