టాలీవుడ్: హ్యాపీ డేస్ ద్వారా తెలుగు సినిమాకి పరిచయం అయ్యి అనతి కాలంలోనే జూనియర్ రవితేజ అని మార్క్ సంపాదించిన హీరో నిఖిల్. కానీ వరుస ప్లాప్ లు ఎదుర్కొనడంతో కొంత డౌన్ అయ్యాడు కానీ ‘స్వామి రారా’ సినిమా దగ్గరి నుండి సినిమా సెలెక్షన్ లో వైవిద్యం చూపిస్తూ ఒక్కో సినిమాకి బ్లాక్ బస్టర్ సాధిస్తూ సెపెరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు నిఖిల్. నిఖిల్ దగ్గరి నుంచి సినిమా వస్తుంది అంటే మినిమమ్ ఎంతో కొంత కంటెంట్ ఉంటది అనే నమ్మకం ఏర్పరచుకున్నాడు నిఖిల్. ప్రస్తుతం నిఖిల్ హీరోగా ‘కార్తికేయ 2 ‘ మరియు ’18 పేజెస్’ అనే రెండు సినిమాలు రూపొందుతున్నాయి.
ఈ రోజు ’18 పేజెస్’ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చింది సినిమా టీం. ఈ పోస్టర్ అప్డేట్ ని కూడా క్రియేటివ్ గా ప్రెసెంట్ చేసింది సినిమా టీం. కాలి పోతున్న ఒక కాగితం తో సిగరెట్ అంటించుకుని ఆ పేపర్ ని చూస్తున్న నిఖిల్ ని చూపించి ఆ పేపర్ లో ’18 పేజెస్’ ఫస్ట్ లుక్ జూన్ 1 న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా మరింత ఆలస్యం అవుతుంది. సినిమాలే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో తన దగ్గరికి వచ్చిన మెడికల్ ఎమెర్జెన్స్స్ ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఎవరైనా మెడిసిన్స్ అవసరం అంటే వీలున్నంతవరకి అవి వారికి చేకూరేట్టు చూసి కష్ట కాలం లో సమాజ సేవ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.