టాలీవుడ్: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి గీతా ఆర్ట్స్ వారు నిర్మిస్తున్న ’18 పేజెస్’. ఈ రోజు నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది సినిమా టీం. ఈ సినిమాలో హీరో నిఖిల్ కి జోడీ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఫస్ట్ లుక్ లో నిఖిల్ కళ్ళకి ఒక పేపర్ ని చుట్టి ఆ పేపర్ పైన అనుపమ తన ఫీలింగ్స్ ని వ్యక్తపరుస్తుంది.
‘నా పేరు నందిని, నాకు మొబైల్ లో అక్షరాలని టైప్ చేయడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైపు చేసే అక్షరాలకు ఎమోషన్స్ ఉండవు. ఎవరు టైపు చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికీ ఒక ఫీలింగ్ ఉంటది, దానిపై నా సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే ఇష్టం’ అని అను ఫీలింగ్స్ ఆ పేపర్ పై రాసినట్టు ఫస్ట్ లుక్ విడుదల చేసింది సినిమా టీం.
వరుస ప్లాప్ ల తర్వాత వరుస హిట్ లు కొడుతున్న నిఖిల్ ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే ఇంప్రెస్ చేసాడు. కుమారి 21 ఎఫ్ సినిమాని డైరెక్ట్ చేసిన పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకి కథ మరియు స్క్రీన్ ప్లే డైరెక్టర్ సుకుమార్ అందించడం విశేషం. గీతా ఆర్ట్స్ వారి GA2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం లో ఈ సినిమా రూపొందనుంది.