టాలీవుడ్: హ్యాపీ డేస్ ద్వారా హీరో గా పరిచయం అయ్యి అడపా దడపా హిట్స్ కొట్టి జూనియర్ రవి తేజ అన్న పేరు సంపాదించిన నిఖిల్ దాదాపు 10 వరుస ప్లాప్ లతో వెనకపడ్డాడు. ‘స్వామి రారా ‘ అనే సినిమాతో యూ టర్న్ తీసుకున్నాడు నిఖిల్. అప్పటి నుండి కథలకే ప్రాధాన్యం ఇస్తూ వరుసగా సూపర్ హిట్ లు కొడుతున్నాడు. నిఖిల్ నుండి ఒక సినిమా వస్తుంది అంటే ఎదో కొత్తదనం ఉంటుంది అని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా నిఖిల్ కథల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం GA2 పిక్చర్స్ బ్యానర్ లో ’18 పేజెస్’ అనే ఒక సినిమా మరియు కార్తికేయ సినిమాకి కోనసాగింపుగా వస్తున్న ‘కార్తికేయ 2 ‘ సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇవి రెండే కాకుండా ఈ రోజు మరొక సినిమా ప్రకటించాడు నిఖిల్. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాని ప్రకటించడం ఆనందంగా ఉందని ఈ సినిమాని ప్రకటించాడు నిఖిల్. ఈ సినిమా గూఢచారి తరహాలో ఒక స్పై థ్రిల్లర్ జానర్ లో రానుందని తెలియ చేసారు. నిఖిల్ కూడా ఇలాంటి క్యాటగిరి సినిమాలో నటించడం ఇదే మొదటిది. సుమంత్ తో ‘మళ్ళీ మొదలైంది‘ సినిమాని రూపొందిస్తున్న రెడ్ సినిమాస్ బ్యానర్ లో చరణ్ తేజ్, రాజ శేఖర్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. BH గారి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ మరి కొద్దీ రోజుల్లో మొదలవనుంది.