మూవీడెస్క్: యంగ్ హీరో నిఖిల్ ‘స్వామి రారా’, ‘కేశవ’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దర్శకుడు సుధీర్ వర్మతో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఈ సినిమా విడుదల తీరును ఎవరూ ఊహించలేదు. తక్కువ ప్రమోషన్లతో ఈ మూవీ రిలీజ్ డేట్ సడెన్ గా ప్రకటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
ఫలితంగా, సినిమా థియేటర్లలో విడుదలైనప్పటికీ ఫ్లాప్ టాక్ అందుకుంది.
క్రైమ్ అండ్ లవ్ జోనర్ గా రూపొందించిన ఈ చిత్రం, కథలో సస్పెన్స్, థ్రిల్ ఇవ్వలేకపోయింది.
స్క్రీన్ ప్లే విషయంలో కాస్త ప్రయోగాలు చేసినా, ప్రేక్షకులకు ఇది కనెక్ట్ కాలేదు.
నిఖిల్ మాత్రం యాక్టింగ్ లో తనకు ఉన్న ప్రతిభను ప్రదర్శించినప్పటికీ, సినిమా కథనానికి తగిన బలం లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు.
ఇదే తప్పు గతంలో ‘స్పై’ చిత్రంతోనూ జరిగిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
‘స్పై’ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయినప్పటికీ, తగిన ప్రమోషన్లు లేకపోవడంతో ఆ సినిమా కూడా అంతగా నిలబడలేదు.
ఇప్పుడు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’లోనూ సరైన సమయంలో, సరైన ప్రమోషన్స్ చేయకపోవడం వలన ఆడియెన్స్ లో బజ్ సృష్టించలేదు.
ఈ రెండు డిజాస్టర్ల తర్వాత నిఖిల్ భవిష్యత్తు చిత్రాలకు మాత్రం తప్పకుండా స్ట్రాంగ్ ప్రమోషన్స్ అవసరమని సినీ వర్గాలు సూచిస్తున్నాయి.